: నేరగాళ్లతో నిండిన వైఎస్సార్సీపీ అసెంబ్లీలో అరాచకం సృష్టిస్తోంది: ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు


వైఎస్సార్సీపీపై ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, నేరగాళ్లతో నిండి వైఎస్సార్సీపీ, శాసనసభలో అరాచకం సృష్టిస్తోందని, అనుచితంగా ప్రవర్తిస్తున్న ఆ పార్టీ సభ్యులపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. జగన్ తరహాలోనే ఆ పార్టీ సభ్యులు నడుస్తున్నారని, వైఎస్సార్సీపీ సభ్యుల ప్రవర్తన కారణంగా ఇతర రాష్ట్రాల ముందు ఏపీ చులకనైపోతోందని రావెల ఆరోపించారు.

  • Loading...

More Telugu News