: 'ఇది కాల్స్ సునామీ... తట్టుకోలేం' అన్న ఎయిర్ టెల్ కు గణాంకాలతో సమాధానమిచ్చిన రిలయన్స్ జియో


రిలయన్స్ జియో మొబైల్ నెట్ వర్క్ నుంచి ఉచిత కాల్స్ సునామీలా వస్తున్నాయని, వాటిని తమ కస్టమర్లకు అందించేలా కనెక్టింగ్ పాయింట్లను అందించలేమని ఎయిర్ టెల్ వెల్లడించిన వేళ, రిలయన్స్ జియో స్పందించింది. "రిలయన్స్ జియో నుంచి ఔట్ గోయింగ్ ట్రాఫిక్ ఒక్కో కస్టమర్ నుంచి గంటకు రెండు కాల్స్ మాత్రమే. అది కూడా పీక్ ట్రాఫిక్ సమయంలో. వీటి కనెక్టింగ్ కు భారీగా పాయింట్స్ అక్కర్లేదు. ఈ కాల్స్ కూడా ఒక్క ఎయిర్ టెల్ కు మాత్రమే వెళ్లడం లేదు. అన్ని టెల్కోలూ పంచుకుంటాయి. దీన్నే సునామీ అని అనడం సరికాదు" అని రిలయన్స్ జియో ఓ ప్రకటన వెలువరించింది. "కావాలనే ఇతర టెల్కోలు మా కాల్స్ కు కనెక్షన్ పాయింట్లు ఇవ్వడం లేదు. ప్రతి 100 కాల్స్ లోను 75 కాల్స్ కనెక్ట్ కావడంలో విఫలమయ్యాయి. గత 10 రోజుల వ్యవధిలో ఎయిర్ టెల్ నెట్ వర్క్ కు వెళ్లిన 22 కోట్ల కాల్స్ ను వారు కనెక్ట్ చేయలేదు. ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యులార్ లకు వెళ్లిన కాల్స్ లో 52 కోట్లు కనెక్ట్ కాలేదు" అని రిలయన్స్ తెలిపింది. రిలయన్స్ ఉచిత ఆఫర్ తో తమ ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతినేలా కాల్స్ వస్తున్నాయని, దీనివల్ల తమకు నష్టమని ఎయిర్ టెల్ వాదిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News