: పాల కోసం బిడ్డ...పాలివ్వలేక తల్లి.. ఇద్దరూ ఏడుస్తున్నారు: హోదా, ప్యాకేజీపై ఎంపీ శివప్రసాద్ కీలక వ్యాఖ్యలు


ఆంధ్రప్రదేశ్ విభజన వద్దంటూ పార్లమెంటులో రకరకాల వేషాలతో అలరించిన టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది కష్టకాలమని అన్నారు. ప్రజలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలా? లేక ప్రత్యేక ప్యాకేజీ కావాలా? అన్నది తేల్చుకోవాలని అన్నారు. పాల కోసం బిడ్డ ఏడుస్తోంది. పాలివ్వలేక తల్లి ఏడుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ బతకాలంటే పౌడర్ పాలను పట్టాలని ఆయన సూచించారు. అంటే ప్రత్యేకప్యాకేజీని తీసుకోవాలని ఆయన తాజా వ్యాఖ్యలతో పేర్కొనడం విశేషం.

  • Loading...

More Telugu News