: మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ఈరోజు సాయంత్రం రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న టీపీసీసీ
మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ అంశంపై రైతుల పక్షాన నిరసన తెలుపుతోన్న టీపీసీసీ నేతలు ఈరోజు ఢిల్లీకి బయలుదేరారు. మల్లన్నసాగర్ అంశంపై ఢిల్లీ పెద్దలకి వారు ఫిర్యాదు చేయనున్నారు. తమ పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు వీరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. పలువురు కేంద్ర ప్రభుత్వాధికారులను కూడా వారు కలవనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకి తాము వ్యతిరేకం కాదని, అయితే, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే రైతుల నుంచి భూమిని సేకరించాలని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు.