: పదేళ్లుగా ఆ గ్రామంలో ఒకేఒక వ్యక్తి నివాసం ఉంటున్నాడు!


ఒంటరిగా ఇంట్లో ఒక్కరాత్రి గడపాలంటేనే చాలామందికి భయం వేస్తుంది. బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. అలాంటిది గ్రామంలో ఒకే ఒక్క వ్యక్తి గత పదేళ్లుగా నివాసం ఉంటున్నాడంటే ఆశ్చర్యం కలగకమానదు. చైనాలోని క్సెన్షాన్సె గ్రామంలో నివసించే ఆ వ్యక్తి పేరు లూ షెంగ్జీయా. ఆయన స్థానిక ఫారెస్ట్‌ ప్రొటెక్షన్ స్టేషన్ వాచ్ మన్‌ గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం వరకు ఆ గ్రామంలో సుమారు 20 కుటుంబాలు నివాసం ఉండేవి. అయితే మారుతున్న కాలంతో పాటు జీవనోపాధిని వెతుక్కుంటూ ఆ 20 కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. పుట్టిన ఊరు, సొంత ఇంటిపై మమకారం చంపుకోని లూ కుటుంబం అక్కడే ఉండిపోయింది. కొంత కాలానికి అతని తల్లి, ఆ తరువాత సోదరుడు మరణించడంతో గత పదేళ్లుగా గొర్రెలను మేపుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. అవసరమైనప్పుడు మాత్రం ఆయన దగ్గర్లోని పట్టణానికి వెళ్లి తనకు సరిపడా నిత్యావసర సరుకులు తెచ్చుకుంటూ ఉంటాడు.

  • Loading...

More Telugu News