: ఢిల్లీ చేరుకున్న అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని
తన రెండు రోజుల పర్యటనలో భాగంగా అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని దేశరాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ఆయన పలు అంశాలపై చర్చించనున్నారు. తమ దేశంలో భారత సర్కారు చేపడుతున్న ప్రాజెక్టుల అంశంపై అష్రాఫ్ ఘని కాసేపట్లో మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. తమ దేశ రక్షణ ఆయుధాలను పెంచుకునే క్రమంలో అఫ్ఘనిస్థాన్ ఇండియా సాయాన్ని కోరనున్నట్లు సమాచారం.