: రాయగడ-విజయవాడ ట్రైన్ ను అడ్డుకున్న అఖిలపక్షం...పెందుర్తి రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత
రాయగడ-విజయవాడ ఫాస్ట్ పాసింజర్ ట్రైన్ ను విశాఖపట్టణంలోని పెందుర్తి రైల్వే స్టేషన్ లో అఖిల పక్షం నేతలు అడ్డుకున్నారు. విశాఖపట్టణానికి రైల్వే జోన్ ను తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఆందోళనలు పెరుగుతున్నాయి. అందులో భాగంగా అఖిలపక్షం నేతలు పెందుర్తి రైల్వే స్టేషన్ లో ట్రైన్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో వారు ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.