: బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన సిద్ధూ... ఆయన బాటలోనే భార్య కూడా!
పంజాబ్ లో 'ఆవాజ్ ఈ పంజాబ్' పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన బీజేపీ మాజీ ఎంపీ, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేడు రాజీనామా సమర్పించారు. ఆయన భార్య కూడా బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు సిద్ధూ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పంజాబ్ ను అవినీతి, మాదక ద్రవ్యాల ముఠాల నుంచి కాపాడేందుకే రాజకీయ పార్టీని పెట్టినట్టు గతవారంలో సిద్ధూ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో తాము పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తాము గెలిస్తే, పంజాబ్ వాసులంతా విజయం సాధించినట్టని, రాష్ట్ర ప్రజలు ప్రస్తుత పరిపాలనపై అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు.