: ఖైరతాబాద్ గణనాథుడిని చూడాలనే కోరికతో రైలెక్కి పారిపోయి వచ్చిన పిల్లలు!

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ భారీగణనాథుడిని చూడాలనే కోరికతో తమ ఇళ్లల్లో చెప్పకుండా వేర్వేరు జిల్లాల నుంచి పారిపోయి వచ్చిన నలుగురు చిన్నారులను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గుర్తించారు. చిన్నారులను రైల్వేస్టేషన్‌లోని సిబ్బంది గమనించి వారిని ప్రభుత్వ హోంకు తరలించారు. రంగారెడ్డి శంకర్‌పల్లికి చెందిన శ్రీహరి(14), కాకినాడకు చెందిన దుర్గాప్రసాద్(12), మహబూబ్‌నగర్‌జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన చంద్రి సంతోష్(12), చంద్రి సురేష్(13)లుగా వారిని గుర్తించారు. పిల్లల తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. వారి తల్లిదండ్రులను పిలిపించి వారి వద్దనుంచి ఐడీ కార్డులు తీసుకొని పిల్లలను అప్పజెప్పుతామని మీడియాకు తెలిపారు.