: అకార‌ణంగా బ‌దిలీ చేశారంటూ ఇంటి నుంచి వెళ్లిపోయిన భువనగిరి సబ్‌జైలు సూప‌రింటెండెంట్


త‌న‌ను అకార‌ణంగా బ‌దిలీ చేశారంటూ న‌ల్గొండ జిల్లా భువ‌న‌గిరి సబ్‌జైలు సూప‌రింటెండెంట్ శ్రీ‌నివాసరావు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇంట్లో ఆయ‌న రాసిన లేఖ‌ను గ‌మ‌నించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఆయన అదృశ్యంపై కేసు న‌మోదు చేసుకొని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. శ్రీ‌నివాసరావు తాను రాసిన లేఖ‌లో త‌న‌ను ల‌క్సెట్టిపేట స‌బ్‌జైలుకి బ‌దిలీ చేయ‌డంపై మ‌న‌స్తాపం చెందిన‌ట్లు పేర్కొన్నారు. జైళ్ల శాఖ డీజీ వి.కె.సింగ్ వేధింపులు ఎక్కువయ్యాయని, తన గురించి ఆయన చెడుగా ప్రచారం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని రాశారు. తన భార్య, బిడ్డలకు దూరంగా ఉండడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. జైళ్ల శాఖ అధికారులు పెడుతున్న వేధింపులపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News