: షహబుద్దీన్ పక్కన నేరస్తుడు... పోలీసులు వెతుకుతున్న షార్ప్ షూటర్ ఇతనే!


బీహార్ మాజీ మంత్రి షహబుద్దీన్ జైలు నుంచి విడుదలైన తరువాత, పాత నేరస్తులు ఆయన పంచన చేరుతున్నారని వస్తున్న వార్తలకు మరో సాక్ష్యం లభించింది. సంచలనం రేపిన సీనియర్ జర్నలిస్టు రాజ్ దేవ్ రాజన్ కేసులో పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ప్రకటించిన షార్ప్ షూటర్ మహమ్మద్ కైఫ్ షహబుద్దీన్ పక్కన కనిపించాడు. షహబుద్దీన్ మీడియాతో మాట్లాడుతుంటే, పక్కనే దర్జాగా నిలబడిన మహమ్మద్ కైఫ్ ఫోటోలను అన్ని పత్రికలు, చానళ్లలో చూపించారు. ఈ సంవత్సరం మేలో రాజ్ దేవ్ రాజన్ హత్య జరుగగా, అప్పటి నుంచి కైఫ్ పరారీలో ఉన్నాడు. ఇప్పుడు షహబుద్దీన్ పక్కన కైఫ్ కనిపించడంతో నితీష్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. "హంతకులకు షహబుద్దీన్ ఎంత దగ్గరగా ఉంటాడోనన్న విషయానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఇంకేం కావాలి?" అని బీజేపీ నాయకుడు, విపక్ష నేత సుశీల్ మోదీ ప్రశ్నించారు. ఇంత బహిరంగంగా నేరస్తులు తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తక్షణం మహమ్మద్ కైఫ్ ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News