: మణిపూర్ లో భూ ప్రకంపనలు
మణిపూర్ లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. సేనాపతి జిల్లాలో ఈ ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనల తీవ్రత 3.7గా నమోదైంది. ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిపోవడంతో స్థానికులు భయాందోళనల్లో మునిగిపోయారు. దీంతో ఇళ్ల లోంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రకంపనలు స్వల్పమేనని, వీటి కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.