: ఐఎస్ఐఎస్ కర్కశత్వానికి పరాకాష్ఠ... మనుషుల పీకలు కోసిన ఉగ్రవాదులు


ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు పవిత్రంగా భావించే బక్రీద్ ను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఖుర్బాని సమర్పించుకున్నారు. ఇదే సమయంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మేకలకు బదులు మనుషుల పీకలు కోశారు. ఇరాక్ లోని మోసూల్ పట్టణంలో అమెరికా సైన్యానికి గూఢచర్యం చేస్తూ సిరియాలో పట్టుబడ్డారని ఆరోపిస్తూ పలువురిని తలకిందులుగా వేలాడదీసి, కర్కశంగా పీకలు కోశారు. ఐఎస్ఐఎస్ ఈ దారుణాన్ని వీడియో తీసి, విడుదల చేసింది. దీనికి ‘మేకింగ్ ఆఫ్ ఇల్యూజన్’ అని పేరుపెట్టింది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News