: స్నేహం మాటున కర్కశత్వం.. ఇంటికి పిలిచి పిల్లల్ని కిడ్నాప్ చేశారు!
కొందరు వ్యక్తులు స్నేహం నటించి ఎటువంటి దారుణాలకు పాల్పడతారో తెలిపే సంఘటన ఇది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...అమృత్ సర్ లో గుర్మీత్ కౌర్ అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమె నివాసానికి దగ్గర్లో ఉండే మంజిత్ కౌర్ అనే మహిళతో గుర్మీత్ కౌర్ కు పరిచయం ఏర్పడింది. దీంతో ఒక రోజు పిల్లల్ని తీసుకుని తమ ఇంటికి రావాలని ఆమె గుర్మీత్ ను ఆహ్వానించింది. ఆమె ఆహ్వానం మేరకు పిల్లలు బాజ్ సింగ్ (8), ఫతే (8 నెలలు) లను తీసుకుని వారికి ఇంటికి వెళ్లింది. వారు ఇంట్లోకి వెళ్లగానే...గుర్మీత్ పై మంజిత్ కుమారుడు మహిందర్ జిత్, వాళ్లింట్లో పనిచేసే హరిజిందర్ దాడికి దిగారు. ఆమె చనిపోయిందని భావించి, ఆమెను కాలువ పక్కన పడేసి, ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లారు. వారిద్దరినీ తీసుకెళ్లి క్షుద్రపూజలు చేసేవారికి అమ్మేశారు. ఇంతలో కాలువ పక్కన పడివున్న గుర్మీత్ కు మెలకువ వచ్చింది. ఎలాగోలా ఇల్లు చేరి, జరిగిన దారుణాన్ని భర్తకు వివరించింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకోగా, బాజ్ ను 50 వేల రూపాయలకు దీరా బాబా నానక్ అనే తాంత్రికుడికి అమ్మినట్లు తెలిసింది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టగా, పూజల్లో బలిచ్చేందుకు యత్నించగా, బాజ్ తిరగబడడంతో బండారం బట్టబయలవుతుందని భావించి, బాలుడ్ని హత్య చేసి ఒక ఊరి సమీపంలో పడేశామని తెలిపారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరు పరిచారు.