: ఊసరవెల్లి మాత్రమే కాదు...ఈ పక్షులు కూడా రంగులు మార్చగలవు!
పరిస్థితులు, పరిసరాలకు అనుగుణంగా శరీర వర్ణాన్ని మార్చుకునే గుణం కేవలం ఊసరవెల్లికి మాత్రమే సొంతమైన విద్య అని అందరికీ తెలిసిందే. అయితే ఇలా ఊసరవెల్లిలా రంగులు మార్చే పక్షులు కూడా ఉన్నాయంటే నమ్మగలరా? ఆస్ట్రేలియాలోని ట్వానీ ప్రాగ్ మౌత్స్ అనే పక్షులను చూస్తే మీరు కూడా నమ్ముతారు. ఎందుకంటే, ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పక్షులు కూడా పరిస్థితులకు అనుగుణంగా శరీర వర్ణాన్ని మార్చుకోగలవు. ఇవి చిన్న చిన్న పురుగులను, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఆహారం సంపాదించడానికి ఇవి ఊసరవెల్లిలా తమ రంగులను మార్చుకోవడం విశేషం. ఇవి సాధారణంగా నలుపు, బూడిద రంగు చారలతో ఉంటాయి.