: ఐఏఎఫ్ యుద్ధ విమానంలో మంటలు
భారత వైమానిక దళానికి చెందిన (ఐఏఎఫ్) యుద్ధ విమానం జాగ్వార్ లో మంటలు చెలరేగాయి. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో విమానంలోని కాక్ పిట్ లో పైలట్ ఉన్నాడు. మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ఈ మంటల్లో విమానం పూర్తిగా కాలి దగ్థమైందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.