: నేడే బ్రిక్స్ సదస్సు...విశాఖ చేరుకున్న 500 మంది ప్రతినిధులు


ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని విశాఖపట్టణం వేదికగా బ్రిక్స్ దేశాల అంతర్జాతీయ సదస్సు నేడు ప్రారంభం కానుంది. సాగరతీరంలో జరగనున్న ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా దేశాలకు సంబంధించిన 500 మంది పట్టణ ప్రాంత ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సదస్సులో పట్టణీకరణ, వాతావరణం, అవకాశాలు, నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించనుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ఉపన్యాసం చేయనున్నారు.

  • Loading...

More Telugu News