: ప్రధానికి ఫోన్ లో కృతఙ్ఞతలు తెలిపాను: సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ ద్వారా కృతఙ్ఞతలు తెలిపానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాకు సమానమైన మొత్తాన్ని ఐదేళ్లలో ఇస్తామని మోదీ తనతో చెప్పారని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. ఇప్పటివరకు అందించిన సహకారానికిగాను పీఎంకు ధన్యవాదాలు తెలిపానని అన్నారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా చంద్రబాబు పరిశీలించారు. అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన వెంటనే తిరిగి విజయవాడకు బయలు దేరారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు చంద్రబాబు బయలుదేరారు.