: నేను ధోనీకి అభిమానిని కాదు: ‘ఎంఎస్ ధోని’ చిత్ర దర్శకుడు
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర దర్శకుడు నీరజ్ పాండే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘నేను ధోనికి అభిమానిని కాదు. నాకు సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ అంటే ఇష్టం. ఈ చిత్రాన్ని చక్కగా తీయాలంటే నేను ధోనికి అభిమానినే కావాలా? కాదు కాబట్టే ఎలాంటి వివక్ష లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను’ అని నీరజ్ పాండే పేర్కొన్నారు.