: కశ్మీర్ లో ముగిసిన ఎన్ కౌంటర్... నలుగురు ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌లో చొరబడిన ఉగ్రవాదులు అక్కడ అలజడి రేపారు. మూడు రోజులుగా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులతో అలుపెరుగని పోరాటం చేసిన భద్రతా బలగాలు దీటైన సమాధానం ఇచ్చాయి. ఎట్టకేలకు ఈరోజు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. వారి వద్ద వున్న ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, 4 ఎ.కె 47 తుపాకులతో పాటు 16 మ్యాగజైన్లను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.