: ‘కర్ణాటక’ నా మెట్టినిల్లు: సినీ నటి జయప్రద
ఏపీ తనకు పుట్టినిల్లు అయితే, కర్ణాటక రాష్టం తనకు మెట్టినిల్లు అని ప్రముఖ సినీనటి జయప్రద చెప్పింది. 2016- శ్రీకృష్ణ దేవరాయల పురస్కారాన్ని ఇటీవల ఆమె అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు మరో జన్మంటూ ఉంటే కళాకారిణిగానే పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, మరో తెలుగు నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, తన మాతృభాష తెలుగు అయినప్పటికీ జీవన భాష మాత్రం ‘కన్నడ’ అని చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయల పేరిట తెలుగు, కన్నడ భాషల్లో ఒక సీరియల్ నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇంకా, ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కన్నడ సాహితీదిగ్గజం బరగూరు రామచంద్రప్పలు ఉన్నారు. కాగా, ఇటీవల బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య చేతులమీదుగా వారు ఈ పురస్కారాలను అందుకున్నారు.