: పవన్ కల్యాణ్! వెంకయ్యకు క్షమాపణలు చెప్పు: బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ డిమాండ్


సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాచిపోయిన లడ్డూలాంటి వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలవాలనుకుంటున్నారని ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదా ఉండి ప్యాకేజీలో లేని, ఓ ఐదు అంశాలు పవన్ కల్యాణ్ చెప్పగలిగితే, ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజీపై పవన్ కల్యాణ్ తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ కు అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ తక్షణం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు గురించి మాట్లాడే స్థాయి పవన్ కల్యాణ్ కు లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాల్సిన పవన్ కల్యాణ్ రివర్స్ లో ప్రయాణిస్తున్నాడని, పవన్ కల్యాణ్ అసహనంతో ఉన్నాడని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ పై ఆయన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర ప్రకంపనలు రేపే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News