: నాకున్న అందాన్ని చూపిస్తే తప్పేంటి?: టీవీ యాంకర్ రష్మీ


సినీ నటి, టీవీ హాట్ యాంకర్ రష్మీ గౌతమ్.. సినిమాల్లో తన అందాన్ని చూపిస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది. 'సినిమాలంటేనే గ్లామర్ ప్రపంచం కదా. అలాంటప్పుడు ఆ గ్లామర్ ప్రపంచంలో నాకున్న అందాన్ని చూపిస్తే తప్పేంటి?’ అని అంటోంది. తన అందాలను తెరపై చూపించే విషయంలో తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవంటోంది. హీరోయిన్లను అందంగా చూపిస్తేనే థియేటర్ కు ప్రేక్షకులు వస్తారని అభిప్రాయపడింది. హీరోయిన్ ను అందంగా చూపించడం, లేదా అలా కనిపించడం తప్పంటే తాను ఒప్పుకోనని తెగేసి చెబుతోంది. అయితే, కొందరు దీనిని మిస్ యూజ్ చేస్తున్నారని అంటోంది. అందానికి, అసభ్యతకీ మధ్య ఉన్న తేడా ఒక చిన్నగీత మాత్రమేనని రేష్మీ చెప్పింది.

  • Loading...

More Telugu News