: మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన కర్ణాటక సీఎం


కావేరి జలాల అంశమై జరిగిన విధ్వంసం కారణంగా పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారమిస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కావేరి జలాల విషయంలో సుదీర్ఘకాలంగా తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తున్నామని, ఈ ఆదేశాల ప్రకారం 6 రోజుల పాటు తమిళనాడుకు నీటిని విడుదల చేశామన్నారు. నీటి విడుదలపై సుప్రీంకోర్టు తీర్పు కష్టంగా ఉన్నా, ఆదేశాలు పాటించాల్సిందేనన్నారు. ప్రజలెవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు మీడియా సహకరించాలని, బెంగళూరు కర్ణాటక రాజధాని మాత్రమే కాదు.. అంతర్జాతీయ నగరమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సిద్ధ రామయ్య అన్నారు.

  • Loading...

More Telugu News