: గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం...బతికి ఉన్న శిశువు మృతి చెందినట్టు నిర్థారణ


గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా దారుణం చోటుచేసుకోబోగా, తల్లిదండ్రుల అప్రమత్తతతో మగశిశువు ప్రాణాలతో బయటపడి, ఐసీయూలో చికిత్స పొందుతున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అనారోగ్యంతో బాధపడుతున్న మగ శిశువును అతని తల్లిదండ్రులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వచ్చారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు శిశువు మృతి చెందాడని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో లబోదిబోమంటూ ఆ తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా, శిశువు ఊపిరి పీల్చుకోవడం, గుండె కొట్టుకోవడాన్ని వారు గుర్తించారు. దీంతో బాబు బతికే ఉన్నాడని, చికిత్స అందించాలని మళ్లీ వైద్యులను కోరడంతో, శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News