: ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ
గవర్నర్ నరసింహన్‌ను కేంద్రం ఢిల్లీకి రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయన ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పరిస్థితులపై ప్రధానితో ఆయన చర్చిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాద అంశాలను ఆయన మోదీకి వివరిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ఏపీ భవన్ పంపిణీ, ఉద్యోగుల విభజన, పలు శాఖలు, హైదరాబాద్‌లోని వివిధ భవనాల విభజన అంశాలను గురించి కూడా ఆయన మోదీకి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ తరువాత ఆయన కేంద్ర హోం శాఖ అధికారులను కలవనున్నట్లు సమాచారం.