: మన దగ్గరా ఆ పరిస్థితి రాకూడదనే ముందు జాగ్రత్త: సీఎం చంద్రబాబు


నీటి సంక్షోభం వల్లే కర్ణాటక, తమిళనాడులో ఘర్షణలు చోటు చేసుకున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నీళ్ల కోసం ప్రజల మధ్య ఘర్షణలు, అశాంతి చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తరాదని, అందుకే నీరు - ప్రగతి కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. నీరు-ప్రగతి కార్యక్రమంపై మంగళవారం చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సంక్షోభాన్ని అధిగమిస్తే అన్ని రంగాల్లో ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఈ దృష్ట్యా భూగర్భ జలాలను పెంచడం, సమర్థ నీటి నిర్వహణ, చెరువుల పునరుద్ధరణపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

  • Loading...

More Telugu News