: వ్యభిచార గృహంలో పట్టుబడిన మహిళలు.. చూసేందుకు ఎగబడిన స్థానికులు
వ్యభిచార గృహాల్లో పట్టుబడిన మహిళలను చూసేందుకు స్థానికులు ఎగబడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. 38 మంది వ్యభిచార గృహ నిర్వాహకులు, బ్రోకర్లు, విటులు సహా పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ వ్యభిచారం నిర్వహిస్తోందన్న సమాచారంతో మదనపల్లెలోని పలు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించినట్టు మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్ విలేకరులకు తెలిపారు. 13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది యువతులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.40వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఒక్కో మహిళకు రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తూ పెద్ద ఎత్తున సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా సెక్స్ రాకెట్ విషయం బయటపడడంతో పోలీస్ స్టేషన్‌లో ఉన్న మహిళలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టుబడిన యువతులను చూసేందుకు ఎగబడ్డారు. ఇళ్లపైకి ఎక్కి మరీ ఎగబడి చూశారు.