: దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు.. ప్రార్థనల్లో ముస్లింలు


త్యాగానికి ప్రతీకగా నిర్వహించే బక్రీద్‌ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు పిల్లాపాపలతో మసీదులు, ఈద్గాలకు చేరుకుని ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఢిల్లీలో బక్రీద్ ప్రార్థనలకు వేలాదిమంది హాజరయ్యారు. జామా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరోవైపు బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మధ్యప్రదేశ్, గుజరాత్ సహా దేశంలోని అన్ని ప్రాంతాలు బక్రీద్ వేడుకల్లో మునిగి తేలుతోంది. ఇక హైదరాబాద్‌లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయాన్నే పెద్ద ఎత్తున మసీదులకు చేరకున్న ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News