: హెచ్‌పీ నుంచి డెస్క్‌టాప్ పీసీలు.. ధర రూ.62 వేలు


ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ తాజాగా రెండు డెస్క్‌టాప్ కంప్యూటర్ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. హెచ్‌పీ పెవిలియన్ వేవ్, హెచ్‌పీ ఎలైట్ స్లైస్ పేర్లతో విడుదల చేసిన వీటి ధర వరుసగా రూ.61,990, రూ.62,990. డెస్క్ టాప్ సైజ్ లుక్‌ను పునరుద్ధరించి వీటిని సరికొత్తగా తయారుచేసినట్టు హెచ్‌పీ ఇండియా డైరెక్టర్ కేతన్ పటేల్ తెలిపారు. హెచ్‌పీ పెవిలియన్ వేవ్ సీపీయూ త్రిభుజాకారంలో ఉండి సాధారణ సీపీయూల కంటే చాలా చిన్నగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పెద్ద సైజు డెస్క్‌టాప్‌తోనూ ఇది కనెక్ట్ అవుతుందన్నారు. రెండు మోడళ్లలోనూ ఇంటెల్ ఐ7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. పెవిలియన్ వేవ్‌లో 16 జీవీ డీడీఆర్ 4 ర్యామ్ అమర్చినట్టు కేతన్ పటేల్ వివరించారు.

  • Loading...

More Telugu News