: స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తోంది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.