: సెల్‌కాన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు తీపి కబురు.. ఆ ఫోన్లకూ జియో ఆఫర్!
సెల్‌కాన్ కంపెనీతో చేతులు కలిపిన రిలయన్స్ ఆ ఫోన్లకు కూడా జియో ఆఫర్‌ను వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సెల్‌కాన్ తయారీ 4జీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, పీసీలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు, సెల్‌కాన్ వినియోగదారులు జియో సిమ్‌ను ఉచితంగా పొందవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం క్యూ4జి ప్లస్, 4జీ ట్యాబ్-7, క్యూ4జీ ట్యాబ్-8 మోడళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో ఆఫర్‌తో తమ అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సెల్‌కాన్ ఎండీ వై.గురు తెలిపారు. రిలయన్స్ నిర్ణయంతో సెల్‌కాన్ వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.