: ఆ రెండు పార్టీలకు మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి: సురవరం సుధాకర్ రెడ్డి
ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని, అందుకే, ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతోందని అన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నవారు ప్యాకేజ్ కావాలని ముందుగానే ఎందుకు డిమాండ్ చేయలేదని, పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు.