: ‘రుణమాఫీ’లో తెలంగాణ కంటే ఏపీ మెరుగ్గా ఉంది: సీఎం చంద్రబాబు
రైతులకు రుణమాఫీ విషయంలో తెలంగాణ కంటే ఏపీ మెరుగ్గా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రుణమాఫీకి సంబంధించి రికార్డులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకున్నందువల్లే తెలంగాణ కంటే ఏపీ మెరుగ్గా ఉండటం సాధ్యమైందన్నారు. పొలం, బంగారం తాకట్టు పెట్టుకుని వ్యవసాయ రుణాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించవద్దని ఈ సమావేశంలో ఆయన సూచించారు. స్కిల్ ఆఫ్ ఫైనాన్స్ కు అనుగుణంగా రుణాలు ఇవ్వాలని అన్నారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని కోరారు. పల్స్ సర్వే ద్వారా బ్యాంకు ఖాతాలు లేనివారిని గుర్తిస్తున్నామని, వారితో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.