: యువకుడిపై సీఐ చేయి చేసుకోవడంపై కేటీఆర్ ఆగ్రహం
ఫ్రెండ్లీ పోలీసింగ్ సిద్ధాంతానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఒక యువకుడిపై సీఐ చేయిచేసుకున్న విషయాన్ని అమీర్ బేగ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై దృష్టి సారించాలంటూ డీజీపీని ఆదేశించారు. కాగా, మంచాలలో ద్విచక్రవాహన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిర్వాహకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న ఒక యువకుడిపై సీఐ చేయిచేసుకోవడం జరిగింది.