: మన జిల్లా ఎమ్మెల్యే మోదీ... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన విద్యార్థులు
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలో కోహ్లా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ కోహ్లా సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. ఆ సందర్భంలో ఆయన ఈ స్కూలును ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఈ స్కూల్లో తనిఖీలకు విద్యాశాఖాధికారులు వచ్చారు. ఈ సందర్భంగా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులను మన జిల్లాకు చెందిన రాజకీయ నాయకుల పేర్లు చెప్పండని అడిగారు. వెంటనే తమ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నరేంద్ర మోదీయేనని విద్యార్థులంతా ముక్తకంఠంతో చెప్పారు. దీంతో షాక్ తిన్న అధికారులు, వారిని వారాల స్పెల్లింగులు చెప్పాలని కోరారు. ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అధికారులు ఉపాధ్యాయులను ప్రశ్నించగా, పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులు మెరుగైన ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారని, దీంతో విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారని సమాధానం చెప్పారు. దీంతో అధికారులు మౌనంగా వెళ్లిపోయారు.