: అమిత్ షా తెలంగాణలో బీజేపీని నిలబెట్టేంత గొప్ప నాయకుడేమీ కాదు: మంత్రి కేటీఆర్


తెలంగాణాకు వచ్చి బీజేపీని నిలబెట్టేంత గొప్ప నాయకుడు అమిత్ షా అని తాను అనుకోనని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 2వ తేదీన ఎంతో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవానికి ప్రాముఖ్యత లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సెప్టెంబర్ 17కు ప్రాధాన్యత ఉంది కానీ, ఇప్పుడు లేదన్నారు. ఈ విషయమై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అయితే, సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ఎవరైనా నిర్వహించాలంటే నిర్వహించుకోవచ్చన్నారు. అమిత్ షా గుజరాత్ లో తమ పార్టీని ముందు గెలిపించుకోవాలని, ఆ తర్వాతే తెలంగాణలో ఆ పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News