: ప్రపంచ టాప్-5 రెజ్లర్లలో స్థానం దక్కించుకున్న సాక్షి మాలిక్
ప్రపంచ టాప్-5 రెజ్లర్ల జాబితాలో ‘రియో’ పతక విజేత, భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కు స్థానం దక్కింది. 58 కిలోల విభాగానికి సంబంధించి యునైటైడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య ర్యాంకుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో సాక్షి మాలిక్ 4వ స్థానంలో నిలిచింది. మరో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ 48 కిలోల విభాగంలో 11వ ర్యాంకు దక్కించుకుంది. పురుషుల విభాగంలో సందీప్ తోమర్, బజరంగ్ పూనియా పేర్లు టాప్ -20 రెజ్లర్ల జాబితాలో ఉన్నాయి.