: నెలకు రూ.15 లక్షల భరణం కావాలి: మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా భార్య డిమాండ్


జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా భార్య పాయల్ అబ్దుల్లా తనకు నెలకు రూ.15 లక్షల భరణం కావాలని డిమాండ్ చేసింది. కాగా, భార్య పాయల్ తనను వేధిస్తోందని, తనకు విడాకులు కావాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్ ను ఆగస్టు 30న ట్రయల్ కోర్టు కొట్టేసింది. వేధింపులకు గల సరైన కారణాలను ఒమర్ చూపలేకపోయారని నాడు ట్రయల్ కోర్టు పేర్కొంది. అయితే, విడాకులు తీసుకునేందుకు తనకు ఇష్టం లేదని పాయల్ కోర్టుకు విన్నవించింది. దీంతో, 2013 నుంచి వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాయల్ తనకు నెలకు రూ.15 లక్షలు భరణం కింద ఇవ్వాలని కోర్టుకు విన్నవించింది. మెయింటెనెన్స్ కు రూ.10 లక్షలు, నివాసం కోసం రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.15 లక్షలు భరణం కింద కావాలని పేర్కొంది. నివాసం లేకపోవడం వల్ల తాను, ఇద్దరు పిల్లలు తన స్నేహితుల ఇళ్లలో ఉండాల్సి వస్తోందని ఆ వినతిపత్రంలో పేర్కొంది. ఈ పిటిషన్ ను విచారించిన ఫ్యామిలీ కోర్టు దీనిపై ఒమర్ అబ్దుల్లాకు నోటీసులు పంపినట్లు పాయల్ తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబరు 27కు వాయిదా వేసినట్లు చెప్పారు. కాగా, ఢిల్లీలోని జమ్మూకాశ్మీర్ అధికారిక భవనం అక్బర్ రోడ్ లోని లుట్యెన్స్ నుంచి పాయల్ ను అధికారులు ఖాళీ చేయించారు.

  • Loading...

More Telugu News