: చంద్రబాబు ఏనాడూ ప్రత్యేకహోదా అడగలేదు...5 లక్షల కోట్లు కావాలనే అడిగారు: ముద్దుకృష్ణమనాయుడు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏనాడూ అడగలేదని ఆ పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, విభజన సమయంలో చంద్రబాబు 5 లక్షల కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశారని అన్నారు. ప్రత్యేకహోదా అనేది కేవలం బీజేపీకి సంబంధించిన విషయమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదా అని ఉండకపోతే... దాని గురించి ఎవరికీ తెలిసి ఉండేది కాదని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదా వల్ల ఎలాంటి లాభం లేదని కేంద్రం చెబుతోంది. అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేయడమే మేలు కదా? అని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఎప్పుడు ప్రత్యేకహోదా వద్దందో, ఎందుకు వద్దందో, చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు రోడ్డుమీద, చెట్లకింద ఉన్నట్టు ఉన్నారు. ప్రత్యేకహోదా కోసం పోరాడడం ఎందుకని ఆయన అన్నారు. 'బీజేపీ ప్రత్యేకహోదా ఇస్తే తీసుకుందాం. లేకుంటే లేదు' అని అన్నారని ఆయన తెలిపారు.