: నయీమ్ కేసు ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’లో కీలక మార్పులు
ఇటీవలే తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ని నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ టీమ్‌లో పలు మార్పులు జరిగాయి. సిట్ సభ్యుల్లో కరీంనగర్ ఓఎస్‌డీ ప్రియదర్శన్, ఖమ్మం అదనపు ఎస్పీ సాయికృష్ణ, హైదరాబాద్ ఎస్‌బీ అదనపు డీసీపీ ఇస్మాయిల్, ట్రాఫిక్ ఏసీపీ జైపాల్, నార్సింగ్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రరావును నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. టీమ్‌లో శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్‌ను కూడా చేర్చారు. ఆయనకు ప్రభుత్వ విభాగాలతో కో ఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు. నయీమ్ కేసులో దర్యాప్తు వేగంగా ముందుకెళుతోంది. ఇప్పటివరకు పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.