: భద్రాచలం సమీపంలోని గ్రామాన్ని దత్తత తీసుకుని, అన్నాహజారేను కలిసిన సినీ నటుడు


ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేను సినీ నటుడు ఆదిత్యా ఓం ('లాహిరి లాహిరి లాహిరిలో' ఫేం)మహారాష్ట్రలోని రాలెగావ్ సిద్ధీలో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని భద్రాచలం సమీపంలోని చెరుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నానని ఆయనకు తెలిపారు. గ్రామాభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని ఆయన అన్నాహజారేను కోరారు. ఈ సందర్భంగా అన్నాహజారే తనకు తెలుగు ప్రజలంటే చాలా ఇష్టమని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెబుతూ పలు సూచనలు చేశారని ఆయన తెలిపారు. ఆయనతో మాట్లాడడం అద్భుతమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News