: ఆందోళనలను అదుపుచేసే శక్తి కర్ణాటక ప్రభుత్వానికి వుంది!: దేవెగౌడ
ఇటీవల కావేరి నదీ జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కర్ణాటక-తమిళనాడు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మాజీ ప్రధాని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడ స్పందించారు. సుప్రీం తీర్పుతో ఈ ఏడాది కర్ణాటక రైతులు ఎంతో నష్టపోతారని ఆయన అన్నారు. కర్ణాటకలో ఉద్రిక్తమవుతున్న నిరసనలను అదుపు చేసే శక్తి సర్కారుకు ఉందని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుతో జలాల విషయంలో నష్టపోయిన రైతులు హింసాత్మకంగా ఆందోళనలు చేపడుతున్నారని ఆయన అన్నారు. కాగా, కర్ణాటకలో తీవ్రరూపం దాల్చుతున్న ఆందోళనలతో బెంగళూరులో పాఠశాలలను బంద్ చేశారు.