: పొట్టిగా, లావుగా ఉన్నావు, మోడలింగ్ కి పనికిరావు అన్నారు... ఇప్పుడు ఆ కల నెరవేరింది: సన్నీలియోన్


న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసిన తొలి బాలీవుడ్ నటిగా చరిత్ర నెలకొల్పిన సన్నీ లియోన్ ఇంకా ఆ ఆనందం నుంచి తేరుకోలేదు. దీంతో తన మోడలింగ్ విశేషాలపై మురిసిపోతూ గతాన్ని గుర్తుచేసుకుంటోంది. 18 ఏళ్ల వయసులో ఉండగా మోడలింగ్ చేద్దామని ప్రయత్నించానని వెల్లడించింది. అయితే అప్పట్లో తాను పొట్టిగా, లావుగా ఉన్నానని మోడలింగ్ కు పనికిరానని చెప్పారని తెలిపింది. దాంతో నిరాశ చెందానని చెప్పింది. అలాంటిది ఇప్పుడు న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేశానని తెలిపింది. అలా నడుస్తున్నప్పుడు ర్యాంప్ పై జారి పడిపోతానేమోనని భయం వేసిందని సన్నీ చెప్పింది. అదే ర్యాంపుపై యాసిడ్ దాడి బాధితురాలు రేష్మా ఖురేషీ కూడా నడిచిందని, ఆమెను కలిసి, మాట్లాడానని, ఆమె ధైర్యం, పట్టుదల చూసి చాలా ఆనందం వేసిందని ఆమె చెప్పింది.

  • Loading...

More Telugu News