: దసరా సమయంలో ‘డోమినోస్’లో పూర్తి శాకాహార మెనూ


దసరా నవరాత్రుళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ వెస్ట్రన్ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ ‘డోమినోస్’ వెజిటేరియన్ ప్రత్యేక మెనూను వినియోగదారులకు అందించనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 9 రోజుల పాటు ఈ ప్రత్యేక మెనూ అందుబాటులోకి రానుంది. భారత్ లోని ‘డోమినోస్’కు చెందిన 500 స్టోర్లలో ఈ ప్రత్యేక మెనూను అందుబాటులోకి తీసుకురానున్నారు. నవరాత్రుళ్లు సందర్భంగా ‘డోమినోస్’లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అమ్మకాలను నిలిపివేయనున్నట్లు ‘డోమినోస్’ పిజ్జా ఇండియా ప్రెసిడెంట్ దేవ్ అమృతేష్ పేర్కొన్నారు. కాగా, ‘డోమినోస్’ గతంలో కూడా నవరాత్రుళ్ల సందర్భంగా వెజిటేరియన్ ఫుడ్ ను మాత్రమే విక్రయించింది. కానీ, ఎంపిక చేసిన అవుట్ లెట్స్ లో మాత్రమే ఈ అవకాశం లభించింది.

  • Loading...

More Telugu News