: దాడికి ప్రతిదాడి... బెంగళూరులోని 'అడయార్ ఆనంద భవన్'పై రాళ్ల వర్షం కురిపించిన కన్నడిగులు


కావేరీ నదీ జలాల వివాదం గాలివానగా మారి ఇరు రాష్ట్రాల ప్రజల్లో కోపావేశాలు నింపింది. ఒకవైపు తమిళనాడులో కర్ణాటక వాహనాలు, కన్నడిగుల హోటళ్లపై దాడులు జరుగుతుండగా, తామేమీ తక్కువ కాదన్నట్టు తమిళ వ్యాపారులు నిర్వహిస్తున్న హోటళ్లపై కన్నడిగులు రాళ్ల వర్షం కురిపించారు. బెంగళూరులోని మైసూరు రోడ్డులో ఉన్న అడయార్ ఆనంద భవన్ పై పదుల సంఖ్యలో నిరసనకారులు దాడులు చేశారు. హోటల్ ను ధ్వంసం చేశారు. అక్కడి అద్దాలను పగులకొట్టి, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. వెంటనే స్పందించిన ర్యాపిడ్ యాక్షన్ బలగాలు అక్కడికి వచ్చి లాఠీచార్జ్ చేసిన తరువాతనే పరిస్థితిని అదుపులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News