: వీధికుక్క కరిచిందని కాల్చిపారేసిన ఎస్ఐ
వీధి కుక్క ఒకటి ఎస్ఐను కరవడంతో దానిని కాల్చిపారేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని చిన్హట్ లో జరిగింది. చిన్హట్ కు చెందిన ఎస్ఐ మహేంద్ర ప్రతాప్ బరాబంకీలో విధులను నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో అతడిని ఒక వీధి కుక్క కరిచింది. అంతే, రెచ్చిపోయిన ఆయన తన ఇంట్లో ఉన్న లైసెన్స్ డ్ తుపాకీని తీసుకువచ్చి ఆ కుక్కను కాల్చిపారేశాడు. అయితే, ఈ సంఘటనపై జంతు ప్రేమికులు, జంతు హక్కుల ఉద్యమకారులు మండిపడుతున్నారు. కుక్కను హతమార్చిన ఎస్ఐపై కేసు ఎందుకు నమోదు చేయరంటూ వారు ప్రశ్నిస్తున్నారు. జంతువుల సంక్షేమ సంఘం కో-ఆప్ట్ మెంబర్ కామ్నా పాండే మాట్లాడుతూ, ఈ సంఘటనపై కేంద్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.