: నా సినిమాలను కర్ణాటకలో విడుదల చేయనని నేను అనలేదు: హీరో శింబు


కావేరీ జ‌లాలపై సుప్రీంకోర్టు ఇటీవ‌ల ఇచ్చిన తీర్పుతో కర్ణాటక-తమిళనాడు మధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. జ‌ల వివాదంపై కర్ణాటకకు మద్దతుగా శాండల్ వుడ్ హీరోలు, త‌మిళ‌నాడుకు మ‌ద్ద‌తుగా కోలీవుడ్ హీరోలు కూడా ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కర్ణాటకలో త‌న సినిమాలు విడుదల చేయబోనని హీరో శింబూ ప్రకటించినట్టు వార్త‌లు వ‌చ్చాయి. సామాజిక మాధ్య‌మాలు వేదిక‌గా ఈ వార్త షికార్లు చేసింది. దీనిపై శింబూ తాజాగా స్పందిస్తూ కర్ణాటకలో త‌న సినిమాలు విడుదల చేయబోనని తాను చెప్పనేలేద‌ని అన్నాడు. అస‌లు జ‌ల‌వివాదంపై ఎటువంటి వ్యాఖ్య‌లూ తాను చేయ‌లేద‌ని చెప్పాడు. కాగా, శింబు త‌న‌ తాజా చిత్రం ‘అచ్చం యెంబాథు మదమైయద’ షూటింగ్ చిత్రీకరణలో ఉన్నార‌ని సినిమా యూనిట్ చెప్పింది.

  • Loading...

More Telugu News