: హీరోగా పరిచయమవుతున్న రోషన్ భవిష్యత్తు గొప్పగా ఉండాలి: నాగార్జున
‘నిర్మల కాన్వెంట్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న రోషన్ భవిష్యత్తు గొప్పగా ఉండాలని ప్రముఖ నటుడు నాగార్జున అన్నారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఈ నెల 16వ తేదీన ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా ‘నిర్మల కాన్వెంట్’ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న నాగ్, ఒక కీలక పాత్ర కూడా పోషించారు. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో రోషన్ కు నాగ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ప్రముఖ నటుడు శ్రీకాంత్, ఊహల తనయుడు రోషన్. ఇటీవల ఈ చిత్రం ఆడియో విడుదలైంది.