: వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ కే కు బెదిరింపు లేఖ
గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టుకు వెళితే చంపేస్తామంటూ ఆ లేఖలో ఆయన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళగిరి అర్బన్ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కాగా, ఓటుకు నోటు కేసులో పునర్విచారణ జరపాలని ఎమ్మెల్యే ఆర్కే తెలంగాణ ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, తనపై కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం, దానిపై కోర్టు స్టే ఇవ్వడం విదితమే.